డిమాండ్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సమర్పించిన ఛార్జ్ షీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్‌కు పాల్పడినప్పుడు ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారన్న విషయం గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుల డిమాండ్ మేరకే తను రాజీనామా చేశారన్నారు. రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేదంటే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా ఉండడం తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం అన్నారు. యంగ్ ఇండియా వెనుక కుట్ర ఏంటో ఈడీ ఛార్జ్‌షీట్ చెబుతుందన్నారు కేటీఆర్. సీటుకు రూటు కుంభకోణం జరిగిందన్నారు. తెలంగాణ సంపదను ఢిల్లీ బాసులకు దోచిపెట్టారని ఆరోపించారు బీఆర్ఎస్‌పై నిందలు.. కాంట్రాక్టర్లతో దందాలు.. ఢిల్లీ బాసులకు రూ.వేల కోట్లు అన్నట్లు రేవంత్ నైజం ఉందన్నారు.. రేవంత్ విషయంలో రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు కేటీఆర్.