మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. భూగర్భజలాలు ఎండి పోతున్నాయని, పంటలు వేయొద్దంటూ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చెప్పడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సింది పోయి పంటలు వేసుకోవద్దంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఓ వైపు ఏపీ సర్కార్ అక్రమంగా నాగార్జున సాగర్, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి అక్రమంగా నీళ్లు తీసుకు పోతుంటే సీఎం నిద్ర పోతున్నారా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చిందంటేనే నీళ్లు, కరెంట్ కష్టాలు తప్పవన్నారు.
ఒకప్పుడు అభివృద్ధి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. దీనివల్ల జలాశయాలు ఎండిపోయి భూగర్భజలాలు గణనీయంగా తగ్గాయని ఆయన హైలైట్ చేశారు.
ఈ సంక్షోభం సహజ కారణాల వల్ల కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం పేలవమైన దూరదృష్టి, అసమర్థత ఫలితమేనని అన్నారు.