మలక్ పేట ఐటీ టవర్ పనుల మాటేమిటి..?
11 నెలలైనా ముందుకు సాగని పనులు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 11వ నెలలో అడుగు పెడుతున్నప్పటికీ మలక్‌పేట ఐటీ టవర్ పనులు ఒక్క అంగుళం కూడా కదలక పోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు కేటీఆర్.
తాను గత అక్టోబర్ 2023లో ప్రతిపాదిత ఐటీ టవర్‌కు పునాది రాయి వేశాననని తెలిపారు. 36 నెలల్లో పూర్తి చేయడానికి నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు.
మలక్‌పేట్, సైదాబాద్, సంతోష్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఇతర ప్రాంతాలకు చెందిన యువకులకు ప్రత్యక్షంగా , పరోక్షంగా 50,000 ఉద్యోగాలు కల్పించడం ఈ ఐటీ పార్క్ లక్ష్యమని స్పష్టం చేశారు కేటీఆర్. ఈ సందర్బంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్తె, లంగాణలోని వివిధ ప్రాంతాలకు ఐటి రంగాన్ని విస్తరించడానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించేలా చూసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు కేటీఆర్.