NEWSTELANGANA

కొణ‌తం దిలీప్ అరెస్ట్ అక్ర‌మం – కేటీఆర్

Share it with your family & friends

సంచ‌ల‌న ఆరోప‌ణలు చేసిన మాజీ మంత్రి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక డెమోక్ర‌సీ లేకుండా పోయింద‌న్నారు.

తెలంగాణ డిజిట‌ల్ మీడియా మాజీ డైరెక్ట‌ర్ కొణ‌తం దిలీప్ ను అక్ర‌మంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు కేటీఆర్. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌మైన పాత్ర పోషించార‌ని తెలిపారు. ఆయ‌న నిఖార్స‌యిన తెలంగాణ వాది అని పేర్కొన్నారు.

కొంత కాలంగా ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని దిలీప్ ప్రశ్నించడాన్ని రేవంత్ సర్కారు తట్టుకోలేక పోతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేటీఆర్.

కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించగా హైకోర్టు చీవాట్లు పెట్టినా, బుద్ధి మార్చు కోవ‌డం లేదంటూ మండిప‌డ్డారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.

కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పకుండా అరెస్ట్ చేశారని మండిప‌డ్డారు. ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే అని నిల‌దీశారు కేటీఆర్. కొణ‌తం దిలీప్ ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.