మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ అవినీతి మంత్రులు ఎవరో తేల్చాలని మంత్రి కొండా సురేఖ చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు తెలియ చేసినందుకు మంత్రిని ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. వెంటనే మంత్రుల లిస్టు బయట పెట్టాలన్నారు. ఫైళ్లను క్లియర్ చేయాలంటే డబ్బులు చెల్లిస్తున్నారని, కానీ తాను ఎలాంటి పైసా తీసుకోవడం లేదంటూ చెప్పారు కొండా సురేఖ. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
చివరకు కొండా సురేఖ నిజాలను మాట్లాడటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కమీషన్ సర్కార్ కొనసాగుతోందన్నారు కేటీఆర్. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పేరుకే ప్రజా పాలన అని అదంతా గాడి తప్పిందన్నారు . తెలంగాణలో ఇది బహిరంగ రహస్యంగా మారింది దురదృష్టకరమన్నారు.
కాంట్రాక్టర్లు కూడా సచివాలయం లోపల ధర్నా నిర్వహించి, ప్రభుత్వ వ్యాపారాన్ని బయటపెట్టారని ఆయన ఎత్తి చూపారు.అంతేకాకుండా, ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ మంత్రులందరినీ పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలని కొండా సురేఖను కేటీఆర్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఆరోపణలపై తమ క్యాబినెట్ మంత్రి విచారణకు ఆదేశిస్తారా అని కూడా ఆయన ప్రశ్నించారు.