బండికి కేటీఆర్ బహిరంగ లేఖ
మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి
హైదరాబాద్ – కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ కు బహిరంగ లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి దాకా కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సర్కార్ నిట్ట నిలువునా ముంచిందని ఆరోపించారు. ఈసారైనా కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తీసుకు రావాలని కోరారు.
ప్రతి బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపిందే తప్పా ఆదుకున్న పాపాన పోలేదన్నారు. అనేకసార్లు పవర్లూమ్ క్లస్టర్ కోసం పది సార్లు కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు కేటీఆర్.
ఇక ఈసారైనా సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్‌ను తెప్పించాలని కోరారు. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించు కోవాలని సూచించారు. మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయని పేర్కొన్నారు.
అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ పాలకుల వైఫల్యం వల్ల సంక్షోభంలో చేనేత రంగం ఉందన్నారు. నేతన్నలను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కారు ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు.