నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
కరీంనగర్ జిల్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించు కోవడం లేదని ఆవేదన చెందారు. సీఎంకు సోయి అన్నది లేకుండా పోయిందని మండిపడ్డారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకోవడంలో ఉన్నంత శ్రద్ద ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని ఆదుకోవాలన్న ధ్యాస లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. బతుకమ్మ చీరల పంపిణీని నిలిపి వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరువు కాటకాలు, నిరుద్యోగుల ఆందోళనలు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక ఆదుకోక పోవడంతో తట్టుకోలేక 10 మంది నేతన్నట్లు సూసైడ్ చేసుకున్నారని తెలిపారు. సీఎం అనాలోచిత నిర్ణయాలు మానుకోవాలని సూచించారు. వెంటనే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు కేటీఆర్.