ద్రవ్య వినియోగ బిల్లు ముఖ్యం
మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాష్ట్ర శాసనసభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము సైతం ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు . ఇదే సమయంలో ప్రధానమైన బిల్లు ఏమిటంటే ద్రవ్య వినియోగ బిల్లు అని..దాని మీద చర్చించాల్సిన అవసరం ముఖ్యమని స్పష్టం చేశారు కేటీఆర్.
దీని మీద రాత్రి 12 గంటల వరకు చర్చించినా తాము ఎలాంటి అభ్యంతరం తెలుప బోమంటూ పేర్కొన్నారు. ఎలాగైనా సరే బిల్లును పాస్ చేద్దామని సూచించారు మాజీ మంత్రి. అంతే కానీ గవర్నర్ ప్రమాణ స్వీకారం ఉందంటూ మధ్యాహ్నం 3 గంటలకే సభను ముగించాలని ప్రయత్నం మాత్రం చేయొదని స్పష్టం చేశారు కేటీఆర్.
ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు. అయితే తాము గవర్నర్ ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకం కాదని ఈ సందర్బంగా మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. పలు సమస్యల గురించి ప్రస్తావించారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చేంత వరకు నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారువ కేటీఆర్.