కాళేశ్వరం జలహారతి పడుతోంది
కాంగ్రెస్ కుట్రలు ఇక చెల్లవు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో మాజీ ముఖ్యమంత్రి కలల స్వప్నం సాకారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం నీళ్లతో కళ కళ లాడుతోంది.
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు కేటీఆర్. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు మాజీ మంత్రి. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ధాటికి కాంగ్రెస్ కుట్రలు కొట్టుకు పోయాయని ఎద్దేవా చేశారు.
కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం..సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని స్పష్టం చేశారు కేటీఆర్. పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలు పటా పంచలయ్యాయని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ సమున్నత సంకల్పం కాళేశ్వరం జై కొడుతోంది..జల హారతి పడుతోందని స్పష్టం చేశారు .
లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో..లక్షకోట్లు వృధా చేశారనే విమర్శలు గల్లంతు అయ్యాయని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం మొక్కవోని దీక్షతో నిలబడిందన్నారు.