సర్కార్ మోసం నిరుద్యోగులకు శాపం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం నిట్ట నిలువునా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఎవరైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే జాబ్స్ , తేదీలు , రిజల్ట్స్ డేట్స్ ఇస్తారని కానీ డిప్యూటీ సీఎం విడుదల చేసిన దానిలో పూర్తి వివరాలు లేవని ఆరోపించారు.
దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేసే ఉద్దేశం లేదని తేలి పోయిందన్నారు కేటీఆర్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తనంతకు తానుగా నిరుద్యోగులతో పెట్టుకున్నాడని, ఆయనకు చుక్కలు చూపించడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఒట్టి బోగస్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల చెవుల్లో పూలు పెట్టారని, ఇప్పుడు మరో పూవు పెట్టేందుకు ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.
ప్రజలు కొంత మేరకు మౌనంగా ఉంటారేమో కానీ నిరుద్యోగులు మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం మేలుకుని ఇచ్చిన మాట ప్రకారం పూర్తి వివరాలతో జాబ్ క్యాలెండర్ లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.