తన అభిమానాన్ని చాటుకున్న వ్యాపారవేత్త
ఆస్ట్రేలియా – డైనమిక్ లీడర్ , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం పవర్ లో లేక పోయినా ఆయనకు ప్రతి చోటా జనాదరణ ఉంటోంది. తెలంగాణ సంస్కృతి, చరిత్రతో పాటు టెక్నాలజీ పరంగా మంచి పట్టుంది కేటీఆర్ కు. ప్రధానంగా ఇంగ్లీష్ తో పాటు అచ్చమైన తెలుగు, స్వచ్ఛమైన తెలంగాణ మాండలికంలో మాట్లాడడంతో జనం ఆయనకు ఎక్కువగా కనెక్ట్ అవుతూ వస్తున్నారు. అంతే కాదు తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందారు.
కేటీఆర్ ను ఎక్కువగా అభిమానించే వారిలో వ్యాపారవేత్తలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తాజాగా రిజ్వాన్ ఖానే అనే వ్యాపారవేత్త ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. కేటీఆర్ నాయకత్వానికి ఆయన ఫిదా అయ్యారు.
నిత్యం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో టచ్ లో ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఫ్యాన్ కూడా. అంతే కాదు తన అభిమానాన్ని వినూత్నంగా పంచుకున్నారు. ఏకంగా తాను కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారుకు సంబంధించి నెంబర్ ప్లేట్ ను కేటీఆర్ పేరుతో పంచుకున్నారు . అది 01 KTRగా పొందడం జరిగింది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతైనా కేటీఆరా మజాకా అంటున్నారు ఆయన అభిమానులు.