DEVOTIONAL

ఆయుత చండీయాగంలో పాల్గొన్న కేటీఆర్

Share it with your family & friends

చేనేత కార్మికుల‌ను ఆదుకోవాల‌ని ప్రార్థించా

క‌రీంన‌గ‌ర్ జిల్లా – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆయుత చండీ యాగంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ద్మశాలి అసొసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు.

ఈ సంద‌ర్బంగా క‌ష్టాల‌లో ఉన్న చేనేత కార్మికుల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని ప్రార్థించాన‌ని చెప్పారు కేటీఆర్. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం ఒక తీరు, మంత్రులు మ‌రో తీరుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు .

రోజు రోజుకు రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్పుతోంద‌న్నారు. రుణ మాఫీ చేస్తాన‌ని చెప్పిన సీఎం ఆచ‌ర‌ణ‌లో విఫ‌లం అయ్యాడ‌ని పేర్కొన్నారు. రుణాల మాఫీకి సంబంధించి రూ. 48 కోట్లు కావాల్సి వ‌స్తుంద‌ని బ్యాంక‌ర్లు చెప్ప‌గా కేవ‌లం రూ. 17 వేల కోట్ల‌తో ఎలా రుణాలు మాఫీ చేశారో బ‌హిరంగంగా చెప్పాల‌ని అన్నారు.

వెంట‌నే కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల రుణాల మాఫీకి సంబంధించి శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు కేటీఆర్. ప్ర‌తి ఒక్క రైతుకు రుణ మాఫీ చేసేంత వ‌ర‌కు బీఆర్ఎస్ పోరాటం ఆప‌ద‌ని హెచ్చ‌రించారు.