NEWSTELANGANA

ఫ‌తేన‌గ‌ర్ ఎస్టీపీని సంద‌ర్శించిన కేటీఆర్

Share it with your family & friends

దేశంలోనే తొలి మురుగు నీటి శుద్ధి కేంద్రం

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధ‌వారం హైద‌రాబాద్ ఫ‌తేన‌గ‌ర్ లోని ఎస్టీపీని సంద‌ర్శించారు. ఆయ‌న వెంట మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కూడా ఉన్నారు. దేశంలోనే త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఇక్క‌డ మొట్ట మొద‌టి మురుగు శుద్ది చేసేందుకు శ్రీ‌కారం చుట్ట‌డం జ‌రిగింద‌న్నారు కేటీఆర్.

హైద‌రాబాద్ వంద శాతం మురుగు నీటి శుద్ది సాధించిన న‌గ‌రంగా అవ‌త‌రించింద‌ని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి. మూసీ న‌ది పున‌రుజ్జీవ‌నానికి ఇది తొలి అడుగు కావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆనాడు దీనికి ప్లాన్ చేసింద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఈ ప్రాజెక్ట్ మొత్తం 1259.50 MLD సామర్థ్యంతో రూ. 3,866 కోట్లతో 31 ఎస్టీపీల‌ నిర్మాణాన్ని కలిగి ఉందని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం హైదరాబాద్ న‌గ‌రానికి సంబంధించి రోజువారీ మురుగునీటి ఉత్పత్తి సుమారు 2,000 ఎంఎల్డీల‌ను నిర్వహించడానికి సెట్ చేయబడింద‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల‌లో ఎస్టీపీలు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో వెల్ల‌డించారు కేటీఆర్. వీటిలో దుర్గం చెరువు, కోకా పేట్, మీరాలం సైట్ -1 , పెద్ద చెరువు, న‌ల్ల చెరువు -1 , మియాపూర్ ప‌లేట్ చెరువు, స‌ఫిల్ గూడ‌, నాగోల్ , ఖాజా కుంట‌, ఫతేన‌గ‌ర్ -1 , వెన్నెల‌గ‌డ్డ‌, ముల్ల క‌తువ చెరువు, శివాల‌య న‌గ‌ర్ , పాలపిట్ట పార్క్ , అత్తాపూర్ -1 , రామ చెరువు, రెయిన్బో విస్టా, అత్తాపూర్ -2, అంబ‌ర్ పేట‌ల‌లో ఎన్టీపీలు నిర్మించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు కేటీఆర్.