పిల్లల చావుల్ని రాజకీయం చేయొద్దు
ప్రభుత్వ హాస్టళ్లపై కక్ష సాధింపు ఏలా..?
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చని పోవటం పై వాపోయారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
మిగతా విద్యార్థుల తల్లి తండ్రులకు గర్బ శోకం మిగల్చ వద్దని కోరారు కేటీఆర్. బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లో పరామర్శించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. చిన్నారి మరణం బాధాకరమన్నారు.
.ఈ 8 నెలల కాలంలో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని తెలిపారు. కొందరు విషాహారం తిని, మరికొందరు పాము కాట్ల కారణంగా, ఇంకొందరు విద్యార్థులు అనుమానాస్పదంగా చని పోయారని చెప్పారు కేటీఆర్. పిల్లలు బాగుండాలని గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక వాటిని గాలికి వదిలి వేసిందని వాపోయారు కేటీఆర్.