DEVOTIONALCULTURE

గుండె నిండుగ బ‌తుక‌మ్మ వేడుక – కేటీఆర్

Share it with your family & friends

బ‌తుకమ్మ పండుగ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ – భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బతుక‌మ్మ పండుగ సంద‌ర్బంగా ఆడ బిడ్డ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ ఆత్మ గౌర‌వానికి, సంస్కృతికి ప్ర‌తీక బ‌తుక‌మ్మ పండుగ అని పేర్కొన్నారు. పువ్వులతో పూజించడం కాకుండా, పువ్వులనే పూజించే అరుదైన, అపు రూపమైన పండగ బతుకమ్మ అని కొనియాడారు కేటీఆర్. విభిన్నమైన తెలంగాణ సంస్కృతిని ప్రతి బింబించే గొప్ప వేడుక మన బతుకమ్మ పండుగ అని తెలిపారు.

రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి..గత తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులందరూ భక్తి శ్రద్ధలతో, ఆట పాటలతో సంబురంగా జరుపుకున్న బతుకమ్మ పండగ… నేడు తొమ్మిదవ రోజుకు చేరుకుంది. తెలంగాణ మహిళలకు, ఆడపిల్లలకు ఎంతో ప్రీతి పాత్రమైన అరుదైన పండుగ‌.

బతుకమ్మ పాటలతో, కోలాటాలతో రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రజలందరూ వైభవోపేతంగా జరుపుకోవాలని ఆశిస్తూ ..శుభాకాంక్ష‌లు తెలిపారు కేటీఆర్.