NEWSTELANGANA

రామోజీ జీవితం స్పూర్తి దాయ‌కం

Share it with your family & friends

కేటీఆర్..హ‌రీశ్ రావు సంతాపం

హైద‌రాబాద్ – ఈనాడు సంస్థ‌ల చైర్మ‌న్ చెరుకూరి రామోజీరావు మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు. శ‌నివారం ఆయ‌న తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. ఈ సంద‌ర్బంగా స్పందించారు.

రామోజీరావు మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు కేటీఆర్ , హ‌రీశ్ రావు. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన అని కొనియాడారు. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయుడిగా ఉండి పోతార‌ని ప్ర‌శ్నించారు.

పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణమ‌ని పేర్కొన్నారు. రామోజీరావు కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, రామోజీ సంస్థల ఉద్యోగులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.