కేటీఆర్ కు అరుదైన ఆహ్వనం
ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్
హైదరాబాద్ – రాష్ట్రంలో పవర్ కోల్పోయినా మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన గతంలో మంత్రిగా ఉన్న సమయంలో పలుమార్లు ఇతర దేశాలలో పర్యటించారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు.
తాజాగా కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా లోని ప్రతిష్టాత్మక యూనివర్శిటీ నుంచి ప్రత్యేకంగా ఇన్విటేషన్ అందుకోవడం విశేషం. వచ్చే ఏప్రిల్ నెలలో నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది.
ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ కు హాజరు కావాలంటూ లేఖ పంపింది కేటీఆర్ కు. ఇందులో భాగంగా భారత పారిశ్రామిక రంగంలో ఉన్న అవకాశాలు, సవాళ్లపై ప్రసంగించాలని కోరింది. ఈ మేరకు తనకు ఆహ్వానం అందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఆయన పంచుకున్నారు.
ఓ వైపు సోదరి లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవడం , మరో వైపు నేతలు జంప్ కావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో ఉన్నట్టుండి ఇన్విటేషన్ అందుకోవడం ఒకింత సంతృప్తిని ఇచ్చేలా చేసింది.