చట్ట బద్ధత ఉంటేనే సర్వే సక్సెస్
లేకపోతే ఫెయిల్ అవుతుందన్న కేటీఆర్
హైదరాబాద్ – కుల గణన సర్వే చేయాలని అనుకోవడంలో తప్పు లేదని కానీ ఆచరణలోకి వచ్చేసరికల్లా ఎదురయ్యే ఇబ్బందుల గురించి కూడా ఆలోచించాలని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. శుక్రవారం కుల గణన అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తాము ఏ కులానికో లేదా ఏ వర్గానికో లేదా ఏ మతానికో పరిమితం కామని స్పష్టం చేశారు. మనుషులంతా సమానమేనన్న ఆలోచనతో తమ పార్టీ ఏర్పడిందని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం జరిగిందన్నారు.
కుల గణనకు సంబంధించి కేవలం తీర్మానం చేస్తే సరిపోదన్నారు. ముందుగా దానిని చట్టం చేస్తేనే సాద్యం అవుతుందని గమనించాలని స్పష్టం చేశారు కేటీఆర్. దీని వల్ల మరింత ముందుకు వెళ్లేందుకు ఛాన్స్ ఏర్పడుతుందన్నారు. లేక పోతే చివరకు కాగితాల వరకే పరిమితం అయ్యే ప్రమాదం లేక పోలేదన్నారు మాజీ మంత్రి.