ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం
స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఫలితాలపై ఆయన స్పందించారు. ఈ మేరకు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 17 సీట్లకు గాను 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాగా మరో 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. మిగిలిన ఒక సీటు ఎంఐఎం దక్కించుకుంది.
ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ భారీగా నష్ట పోయింది. చాలా చోట్ల అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరాశ పరిచాయని చెప్పారు కేటీఆర్. త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు.
పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తు పల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు.
బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన గౌరవం, విజయం మరేది లేదని గుర్తు చేశారు. గతంలోనూ ఇలాంటి ఎదురుదె బ్బలు తిన్నప్పటికీ ప్రజాదరణతో బీఆర్ఎస్ పుంజుకున్న సందర్భాలెన్నో ఉన్నాయన్నారు కేటీఆర్.