NEWSTELANGANA

ప్ర‌శ్నిస్తే దాడి చేస్తారా – కేటీఆర్

Share it with your family & friends


సీఎంకు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేదు

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హామీల గురించి ప్ర‌శ్నిస్తే సీఐ దాడి చేయ‌డం ప‌ట్ల ఆగ్రహం వ్య‌క్తం చేశారు . బుధ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం వాట్సాప్ లో ప్రశ్నించినందుకు భాస్కర్ ముదిరాజ్ అనే వ్యక్తిని మహబూబ్ నగర్ సీఐ అప్పయ్య బెల్ట్ తో కొట్టిన ఘటనపై కేటీఆర్ మండిప‌డ్డారు.

బాధితుడు భాస్కర్ కు ఫోన్ చేసి.. జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నించే వ్యక్తులను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు.

దాడికి పాల్పడిన సీఐపై న్యాయ పరంగా పోరాటం చేయటంతో పాటు బీసీ కమిషన్, హ్యుమన్ రైట్స్ కమిషన్ కు కూడా వెళ్తామన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ మొత్తం భాస్కర్ కు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది పోయి అడిగిన వారిని ఇలా పోలీసులతో కొట్టించటం దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించొద్దని సూచించారు.