ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగం
మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంత మంది కిరాతకుల జంట ఫోన్లను పోలీసులు తమ విచారణలో భాగంగా ట్యాపింగ్ చేశారని , అయితే తప్పేంటి అంటూ ప్రశ్నించారు.
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిలో ప్రధానంగా కీలకమైన పోలీసు ఉన్నతాధికారులు వెంకటేశ్వర్ రావు, రాధా కిషన్ రావు, ప్రణీత్ రావు ఉన్నట్లు తేలింది. లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చట్ట విరుద్దం. భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు విచారణలో తేలింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటారనే పేరుంది ఆయనకు.
ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఈ కేసులో ఉన్నారని తేలడం విస్తు పోయేలా చేసింది. అయితే వారికి వత్తాసు పలికేలా కేటీఆర్ కామెంట్స్ చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.