రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు
కోర్టులో లాయర్ సుందరం ఆరోపణ
హైదరాబాద్ – కావాలని రాజకీయ కక్ష సాధింపుతోనే మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారని ఆరోపించారు కేటీఆర్ లాయర్ సుందరం. తనపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్బంగా శుక్రవారం కోర్టులో తీవ్ర వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి.
అసలు కేటీఆర్ కు ఈ కేసుతో సంబంధం లేదని, ఎక్కడ లబ్ది పొందారో చెప్పాలన్నారు సుందరం. 11 నెలల తర్వాత కేసు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు. విచిత్రం ఏమిటంటే ప్రాథమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ ఎలా చేస్తారని, ఇది పూర్తిగా చట్ట విరుద్దమని స్పష్టం చేశారు.
అఫెన్స్ జరిగిందని తెలిశాక మూడు నెలల లోపే కేసు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. అక్టోబర్ 2023లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎఫ్ఈఓకు డబ్బులు చెల్లించారని, ఇందులో తప్పు ఏముందన్నారు లాయర్ సుందరం. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు జరిపితే ఉల్లంఘన ఎలా అవుతుందో సర్కార్ లేదా ఏసీబీ చెప్పాలన్నారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో నేరం ఎక్కడా జరగలేదని, కావాలని ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.