శ్రీకాంతాచారి అమరత్వం గొప్పది
తెలంగాణ సమాజం మరిచి పోదు
హైదరాబాద్ – శ్రీకాంతాచారి అమరత్వం గొప్పదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటీకి మరిచి పోదన్నారు.
తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సాగించిన దమనకాండ, కేసీఆర్ అరెస్ట్ ను చూసి తట్టుకోలేక పోయిన శ్రీకాంతాచారి అగ్నికి అహుతి అయ్యి అమరుడయ్యాడని కొనియాడారు.
శ్రీకాంతాచారి ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయనకు జోహార్లు అర్పిస్తున్నాని పేర్కొన్నారు కేటీఆర్.
ఆనాడు తాడో పేడో తేల్చుకునేందుకు పోరాటం చేసేలా శ్రీకాంతాచారి అమరత్వం కీలకంగా మారిందన్నారు. తాను అగ్నికి ఆహుతి అవుతూ జై తెలంగాణ అంటూ నినదించిన ఆ నినాదం దిక్కులు పిక్కటిల్లేలా యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా వణుకు పుట్టించేలా చేసిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో ఉద్యమ జ్వాలను రగిలించిందన్నారు.
తెలంగాణ రాదని భావించి 2009 నవంబర్ 29న హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ చౌరస్తాలో అందరూ చూస్తూ ఉండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఐదు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. వీర మరణం పొందాడు.