Tuesday, April 22, 2025
HomeNEWSసిద్దారెడ్డి నిర్ణ‌యం కేటీఆర్ హ‌ర్షం

సిద్దారెడ్డి నిర్ణ‌యం కేటీఆర్ హ‌ర్షం

ప్ర‌భుత్వ స‌న్మానం తిర‌స్కారం

హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌లు కురిపించారు ప్ర‌ముఖ క‌వి నందిని సిద్దారెడ్డి తీసుకున్న నిర్ణ‌యాన్ని. తెలంగాణ తల్లి రూపం మార్చి బతుకమ్మను తొలగించడం మన రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవానికి చెరగని మచ్చ అంటూ సంస్కృతి ని హననం చేసే ప్రభుత్వం చేత సన్మానం చేయించు కోలేనని ప్రకటించినందుకు నందిని సిద్దారెడ్డిని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ నందిని సిధారెడ్డి తీసుకున్న సాహసోపేతమైన ఉదాత్త నిర్ణయం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణం అని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి పరిరక్షణకు మీరు చూపిన నిబద్ధతకు నా హృదయపూర్వక అభినందనలు అని అన్నారు కేటీఆర్.

ఆత్మగౌరవ పరిరక్షణ ఉద్యమంలో మీ మార్గ దర్శకత్వానికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్న‌ట్లు తెలిపారు మాజీ మంత్రి. మిగ‌తా క‌వులు, క‌ళాకారులు , ఇత‌రులు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించాల‌ని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments