పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ ఎగరాలి
పిలుపునిచ్చిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క శాతం తేడాతో ఓటమి పాలయ్యామని, దానిని గుర్తించి కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని, అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
పార్టీ పరంగా నేతలు, కార్యకర్తలు, శ్రేణులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగిన మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ 420 హామీలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని అన్నారు. మోస పూరిత హామీలతో పవర్ లోకి వచ్చారని వాటిని అమలు చేయడంలో విఫలం అయ్యారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. ప్రజలు కాంగ్రెస్ ను భరించే స్థితిలో లేరన్నారు కేటీఆర్.
ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కాలే యాదయ్య, అరికెపుడి గాంధీ, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేష్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు