సార్వత్రిక ఎన్నికల్లో గులాబీదే జెండా
స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్
నాగర్ కర్నూల్ జిల్లా – సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ జెండా రెప రెప లాడడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంగళవారం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఆలంపూర్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గిని ప్రసంగించారు.
అధికారం పోగానే చాలా మంది పార్టీని విడిచి పెట్టారని, అయినా తమకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ఎవరు ఉన్నా లేకున్నా గులాబీ వాడి పోదన్నారు. కారు సత్తా ఏమిటో, ఉద్యమ నాయకుడు కేసీఆర్ యుద్ద రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూస్తారన్నారు.
ఈసారి కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగేలా ప్రజలు షాక్ ఇవ్వ బోతున్నారని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ నడిగడ్డలో రెండు స్థానాలలో విజయం సాధించామన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతపు ప్రజలకు రుణపడి ఉంటామన్నారు.
అయినా తట్టుకుని నిలబడ్డాం, 39 స్థానాల్లో జెండా ఎగుర వేశాం. కానీ 14 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యామని వాపోయారు. ప్రతిపక్షంగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు ఛాన్స్ ఇచ్చారని అన్నారు కేటీఆర్.