అసెంబ్లీలో ప్రశంసించిన కేటీఆర్
హైదరాబాద్ – ఈ దేశం గర్వించ దగిన నేతలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు అని కొనియాడారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఆయనకే దక్కుతుందన్నారు. మన్మోహన్ సింగ్ ను కోల్పోవడం దేశానికి తీరని లోటు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.
సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడ్రన్ ఇండియా అంటూ ప్రశంసలు కురిపించారు. మన్మోహన్ సింగ్ లోని మేధను, జ్ఞానాన్ని, ఆర్థిక రంగ అనుభవాన్ని గుర్తించిన తొలి వ్యక్తి దివంగత పీఎం పీవీ నరసింహారావు అని అన్నారు. గొప్ప ఆలోచనకు అరుదైన సందర్బంగా వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదన్నారు.
మన్మోహన్ సింగ్ కాలంలోనే తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పారు కేటీఆర్. కేంద్రంలో ఓబీసీకి సంబంధించి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేసీఆర్ కోరారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. తాము కూడా మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని కోరుకుంటున్నామని, కేంద్రం దీనిని పరిశీలించాలని కోరారు.