ఎన్ని కేసులు పెట్టినా డోంట్ కేర్
మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్
హైదరాబాద్ – తనపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేసు నమోదు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ కూడా అవినీతి జరగలేదన్నారని, అయితే ప్రొసీజర్ మాత్రమే సరిగా లేదన్నారని అన్నారు. సీఎం కావాలని వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఆయన కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. మేం కూడా లీగల్‌గానే ముందుకెళతామని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు కేటీఆర్.
అనవసరంగా బెదిరింపులకు పాల్పడాలని చూస్తే జనం ఊరుకోరని హెచ్చరించారు. ఇదిలా ఉండగా స్పీకర్ పోడియం మెట్లపైకి వెళ్లిన ఎమ్మెల్యే హరీష్ రావు.. వెల్‌లోకి దూసుకెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వెల్‌లోకి దూసుకెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహంగా లేచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరయ్య.. మార్షల్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట చోటు చేసుకుంది.