టీవీ..యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ షాక్
నోటీసులు పంపించిన మాజీ మంత్రి
హైదరాబాద్ – తమ కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పరువు పోయేలా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. ఆధారాలు లేకుండా అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు వ్యతిరేక ప్రచారం చేస్తున్న టీవీ, సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న యూట్యూబ్ ఛానళ్లకు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ మేరకు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయా చానళ్లకు కేటీఆర్ ఆదివారం లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇది పూర్తిగా ఉద్దేశ పూర్వకంగా చేశారంటూ ఆరోపించారు కేటీఆర్. ఇదిలా ఉండగా కొన్ని సంస్థలు అసత్య పూరిత వీడియోలు తీసి వేస్తున్నామని కొన్ని ప్రకటించాయి.
ఇదిలా ఉండగా కేవలం ఒక కుట్రలో భాగంగా , పనిగట్టుకుని తమను టార్గెట్ చేయడం దారుణమన్నారు. చట్ట బద్దంగా ఎలా ఎదుర్కోవాలొ తమకు బాగా తెలుసన్నారు కేటీఆర్. తమకు సంబంధం లేని విషయాలలో, తమ పేరును, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ యూట్యూబ్ ఛానల్ పైన న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు కేటీఆర్.
ఈ మేరకు గతంలో పలు నోటీసులు పంపించిన కేటీఆర్ తాజాగా మరో 10 సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు.