ఢిల్లీలో పోరాటం తెలంగాణలో వెల్ కమ్
అదానీకి రెడ్ కార్పెట్ పరుస్తున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ – సెబీ ఆరోపణల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
రెండు నాల్కల ధోరణి మంచి పద్దతి కాదన్నారు. ఓ వైపు రాహుల్ గాంధీ పదే పదే పార్లమెంట్ లో అదానీ గురించి ప్రశ్నిస్తున్నారని, ఏఐసీసీ అదానీ వ్యవహారంపై విచారణ చేయాలని డిమాండ్ చేసిందని కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఉండడం అనుమానాలకు తావిస్తోందన్నారు కేటీఆర్.
ఢిల్లీలో కాంగ్రెస్ పోరాటానికి పిలుపు ఇస్తుంటే తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గౌతమ్ అదానీకి ధారదత్తం చేసేందుకు తహ తహ లాడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సీఎను ఆపగలిగే శక్తి రాహుల్ గాంధీకి ఉందా అని ప్రశ్నించారు.
అదానీతో దేశానికి నష్టమైనప్పుడు.. తెలంగాణకు లాభం ఎట్లా అవుతుందని రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్. మొత్తంగా చూస్తే అదానీపై పోరాటం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదని తేలి పోయిందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సీఎంకు బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నారని అన్నారు.