దేవుళ్ల మీద ఒట్టేసి శఠ గోపం పెడితే ఎలా..?
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై, సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇన్నోవిటేవ్ థింకింగ్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు కేటీఆర్.
ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత మాట తప్పడం. దేవుళ్ళ మీద ఒట్టేసి వారికి కూడా శఠగోపం పెట్టడం రేవంత్ రెడ్డికే చెల్లిందని పేర్కొన్నారు.
నూరు రోజులు, ఆరు గారంటీలు అని ఊదరగొట్టి తర్వాత వాటిని మర్చిపోవడం, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిరోజూ ఒక కొత్త డ్రామా సృష్టించి, హెడ్ లైన్ మేనేజ్ మెంట్ చేయడం తప్పితే చేసింది ఏమీ లేదన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు కేటీఆర్. గతంలో ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టలేదు అని చిల్లర మాటలు మాట్లాడి, ఇప్పుడు 15 వేల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే కట్టినట్లు ఫోజులు కొట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
అర్హతలు లేని బావమరిది కంపెనీ కి వేల కోట్ల ప్రజా సొమ్ము ఎలా కట్ట బెడతారంటూ సీఎంను నిలదీశారు.
కుటుంబ పాలన అని విమర్శించి, ఇది వరకు అడ్రస్ లేని తన అన్నదమ్ముళ్లు వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని మభ్య పెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలాన్ని ఢిల్లీ బాసులకు దారాదత్తం చెయ్యడం, ఇతర పార్టీ MLA లను చేర్చుకోవడం, తర్వాత చేరలేదని బుకాయించడం , ఫార్మా సిటీ రద్దు అని బయట చెప్పడం, హైకోర్ట్ లో మాత్రం రద్దు చెయ్య లేదు అని న్యాయమూర్తులను కూడా మోసం చెయ్యడం ఇదేనా మీ ఇన్నోవేటివ్ థింకింగ్ అని నిప్పులు చెరిగారు కేటీఆర్.