మూసీ పేరుతో దోచుకుంటామంటే ఊరుకోం
సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన మూసీ పేరుతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకాన్ని ప్రజలు చూస్తున్నారంటూ హెచ్చరించారు.
మంత్రులు ఒక రీతన సీఎం మరో రీతిన ప్రకటనలు చేస్తూ జనాన్ని కన్ ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ సుందీకరణ పేరుతో జరుగుతున్న బాగోతాన్ని బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఎండ గడుతూనే ఉంటుందని హెచ్చరించారు కేటీఆర్.
ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన తీవ్రంగా స్పందించారు. మూసీని అందంగా ముస్తాబు చేస్తామంటూ అందమైన మాటలు చెప్పారని, మొన్న రూ. 50 వేల కోట్లు అవుతుందని , నిన్న రూ. 70 వేల కోట్లు ఖర్చవుతుందంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఉన్నట్టుండి ఇవాళ లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల తల రాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్లయితేనే
గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు మూసీ పేరుతో కొత్త మోసానికి తెర లేపిందని ఆరోపించారు కేటీఆర్.
సర్కార్ ను, సీఎంను ఈ సందర్బంగా నిలదీశారు. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులు ఎంత మంది..నిల్వ ఉంచే టీఎంసీలు ఎన్ని..సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. పుట్టిన నేలపై మమకారం లేని రేవంత్ రెడ్డికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా మూసీ ప్రాజెక్టు పైనే ఎందుకు ఆసక్తి అని నిలదీశారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్ పై, ఎ. రేవంత్ రెడ్డిపై ఉందన్నారు.
కాంగ్రెస్ ధన దాహానికి సజీవ సాక్ష్యం మూసీ అంచనా వ్యయం అని ఆరోపించారు కేటీఆర్.