NEWSTELANGANA

రుజువు చేస్తే దేనికైనా సిద్దం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. ముఖ్య‌మంత్రిగా ఉండే అర్హ‌త , అనుభ‌వం అస‌లే లేద‌ని పేర్కొన్నారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

తాను చెప్పింది త‌ప్ప‌ని రుజువు చేస్తే చంచ‌ల్ గూడ జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాన‌ని అన్నారు. ఒక‌వేళ తాను చేసిన స‌వాల్ కు స్పందించ‌క పోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్ర‌శ్నించారు కేటీఆర్.

వార్డెన్ సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసిన ఘ‌న‌త సీఎంకే ద‌క్కుతుంద‌న్నారు. ముందు ఆయ‌న‌ను జైలులో పెట్టాల‌ని డిమాండ్ చేశారు . అది త‌ప్ప‌ని త‌మ పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా హెడ్ క్రిశాంక్ ను జైల్లో పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.

ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పడం ఖాయమ‌ని జోష్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మోదీ ఒక్క‌ట‌య్యార‌ని, ఈ ఇద్ద‌రూ అనుచిత వ్యాఖ్య‌లు చేసినా ఈసీ ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు.