పోలీసుల తీరు దారుణం – కేటీఆర్
మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ పై ఆగ్రహం
హైదరాబాద్ – మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . ఆయన మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని సందర్శించి..పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీసులు రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యం లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కోడంగల్ మాజీ ఎమ్మెల్యే ను ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు మఫ్టీలో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సీఎంతో పాటు ఆయన సోదరుడు , కాంగ్రెస్ నాయకులు కోడంగల్ కు వెళ్లాలంటే భయపడుతున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై పోరాటం చేస్తామని ప్రకటించారు. అప్రజాస్వామిక పద్దతులకు స్వస్తి పలకాలని హెచ్చరించారు. రాజ్యాంగానికి అనుగుణంగా నడుచు కోవాలే తప్పా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు కేటీఆర్.
స్థానిక ఎంపీ అయిన డీకే అరుణా భరత సింహా రెడ్డి లగచర్ల గ్రామానికి వెళతానంటే ఆమెను కూడా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. 300 మంది పోలీసులు ఎలా వెళతారని ప్రశ్నించారు.