NEWSTELANGANA

ధాన్యం సేక‌ర‌ణలో బిగ్ స్కామ్

Share it with your family & friends

రూ. 11 వంద‌ల కోట్లకు పైగా మోసం
హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న కాంగ్రెస్ స‌ర్కార్ పై, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆదివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

స్కామ్ ల‌కు కేరాఫ్ గా కాంగ్రెస్ పార్టీ మారింద‌ని ఆరోపించారు. రూ. 11 వంద‌ల కోట్ల కుంభ‌కోణానికి తెర లేపింద‌న్నారు. 35 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం సేక‌ర‌ణ కోసం గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిచింద‌ని చెప్పారు. ఏకంగా రూ. 700 నుండి రూ. 750 కోట్ల కుంభ‌కోణం చోటు చేసుకుంద‌ని ఆరోపించారు.

పిల్ల‌లు తినే మ‌ధ్యాహ్న భోజ‌నం ప‌థ‌కం కోసం రూ. 2 ల‌క్ష‌ల 20 వేల మెట్రిక్ ట‌న్నుల స‌న్న బియ్యం కొనుగోలు కోసం ఈ టెండ‌ర్ పిలిచార‌ని చెప్పారు. దీని పేరు మీద‌నే దాదాపు రూ. 300 కోట్ల‌కు పైగా స్కామ్ జ‌రిగింద‌ని ఆరోపించారు కేటీఆర్.

ఇక రెండు స్కామ్ లు క‌లిపితే రూ. 11 వంద‌ల కోట్ల‌కు పైగా కుంభ‌కోణం జ‌ర‌గ‌డం దారుణ‌మ‌న్నారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. లేక పోతే తాము ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు కేటీఆర్.