మూసీపై కోమటిరెడ్డికి అవగాహన లేదు
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
మంత్రి వెంకట్ రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదన్నారు.. ఆయనకి ఏం తెలువదంటూ ఎద్దేవా చేశారు . కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలని అన్నారు. అప్పుడు వెంకట్ రెడ్డికి మూసీ వద్ద ఉన్న ప్రజలు సన్మానం కూడా చేస్తారని అన్నారు కేటీఆర్.
మూసీ పైన ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ)లపై కూడా ఆయనకు అవగాహన లేదన్నారు. ఎస్టీపీలు పూర్తి అయిన తర్వాత మూసీలో మురికి నీళ్లు ప్రక్షాళన అవుతాయని పేర్కొన్నారు. ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కనీసం అవగాహన లేక పోవడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కొండా సురేఖ నోటిని ఫినాయిల్ తో కడగాలని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఆమెకు అలవాటుగా మారిందన్నారు.