Sunday, April 20, 2025
HomeNEWSరాహుల్ బూట‌కం రేవంత్ నాట‌కం - కేటీఆర్

రాహుల్ బూట‌కం రేవంత్ నాట‌కం – కేటీఆర్

అంబానీ..అదానీల‌ను ఎందుకు అడ్డుకోలేదు

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్ప‌లు చెరిగారు. ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బ‌రేలి ఎంపీ రాహుల్ గాంధీని ఏకి పారేశారు. ఆదివారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఓ వైపు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని, మ‌రో వైపు అదానీ, అంబానీల‌ను తిడుతూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న ఘ‌న‌త రాహుల్ గాంధీకే ద‌క్కుతుంద‌న్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అదానీ, అంబానీల‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం ఎంత వ‌ర‌కు స‌బబు అని ప్ర‌శ్నించారు. దీనిపై ఎందుకు రాహుల్ గాంధీ అభ్యంత‌రం చెప్ప‌డం లేదంటూ నిల‌దీశారు.

చెప్పేది ఒక‌టి చేసేది మ‌రోక‌టి అని తేలి పోయింద‌న్నారు. అడ్డ‌గోలు హామీలు ఇస్తూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ పోతే ఏదో ఒక రోజు ప్ర‌జ‌లు తిర‌గ‌బడే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు. సీఎం త‌న కుటుంబం కోసం ఫార్మా కంపెనీని తీసుకు వ‌స్తుంటే ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని నిప్పులు చెరిగారు కేటీఆర్ రాహుల్ గాంధీని ఉద్దేశించి.

అదాని , అంబానీలపై మీ జంగ్ ఏమైంద‌న్నారు. రామ‌న్న‌పేట‌లో అదాని ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచారో చెప్పాల‌న్నారు. నేను కొట్టినట్లు చేస్తా… నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా? కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా? రేవంత్ – అదానీలతో వ్యాపార బంధమా? అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

అదాని – అంబానీలపై మీ పోరాటం ఓ భూటకం..తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రం అంటూ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments