NEWSTELANGANA

పోలీస్ కుటుంబాల‌పై పోలీసుల దాడులా..?

Share it with your family & friends

ఆవేద‌న వ్య‌క్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్

ఆదిలాబాద్ జిల్లా – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గురువారం ఆయ‌న రైతుల ధ‌ర్నా కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు. అంత‌కు ముందు మార్గ‌మ‌ధ్యంలో ఆందోళ‌న చేప‌ట్టిన పోలీసు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి అండ‌గా ఉంటామాని హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసుల కుటుంబాలను పోలీసులే గుంజుకు పోయే పరిస్థితి తెచ్చిన ఘ‌నత తుగ్ల‌క్ రేవంత్ రెడ్డికే ద‌క్కుతుంద‌ని మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. పోలీసులు శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టంలో కీల‌క పాత్ర పోషిస్తార‌ని, వారి ప‌ట్ల ఉదాసీన వైఖ‌రి ఎంత మాత్రం మంచిది కాద‌న్నారు కేటీఆర్. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

డిచ్ పల్లి 7వ బెటాలియన్ ముందు ధర్నా చేస్తున్న కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. వారి స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న సావ‌ధానంగా విన్నారు. అనంత‌రం బెటాలియన్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంత తొందరగా కానిస్టేబుల్ ల సమస్యలను తీర్చాలని కోరారు కేటీఆర్.

తొందరగా ఈ సమస్యను తేల్చకుంటే పార్టీ తరఫున వారికి అండగా ఉండి… అవసరమైతే నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని హెచ్చ‌రించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.