మాజీ మంత్రి కేటీఆర్ సీఎంకు సవాల్
సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. నిరాధారమైన ఆరోపణలు చేయడం పనిగా పెట్టుకున్నాడని, దమ్ముంటే ఎలాంటి విచారణైనా చేసుకోవచ్చని సవాల్ విసిరారు. పరిపాలన చేతకాక మిస్టరీ మరణాలకు సంబంధించి తన పేరును ప్రస్తావించడం దారుణమన్నారు. నిరభ్యంతరంగా ఎవరితోనైనా , ఏ సంస్థతోనైనా ఎంక్వయిరీ చేసుకోవచ్చని స్పష్టం చేశారు కేటీఆర్. గత 15 నెలలుగా అటెన్షన్, డైవర్షన్ రాజకీయాలు చేయడం తప్పితే చేసింది ఏమీ లేదన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి చెబుతన్నవన్నీ అబద్దాలు తప్పా నిజాలు కావన్నారు. ఆయనను జనం నమ్మడం మానేశారని ఇది గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు . ఇచ్చిన హామీల ఊసేదన్నారు. ఓ వైపు ఎస్ఎల్బీసీ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఎందుకని రేవంత్ రెడ్డి సందర్శించడం లేదని ప్రశ్నించారు. ఇదేనా మీరు చెబుతున్న ప్రజా పాలన అంటూ నిప్పులు చెరిగారు.
ప్రజలు తప్పకుండా గుణ పాఠం చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు కేటీఆర్. వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేవలం ఉబుసుపోక కబుర్లతో ఇలా ఎంత కాలం నెట్టుకు వస్తారంటూ నిలదీశారు. ఇకనైనా పాలనపై ఫోకస్ పెడితే మంచిదని సూచించారు.