Tuesday, April 22, 2025
HomeNEWSరేవంత్..కోడంగ‌ల్ నీ అయ్య జాగీరా

రేవంత్..కోడంగ‌ల్ నీ అయ్య జాగీరా

మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ‌, కోడంగ‌ల్ నీ అయ్య జాగీరా అని నిల‌దీశారు. రైతులు తమ భూమి ఇవ్వం అని అంటే జైల్లో పెడతావా అని మండిప‌డ్డారు. లగచర్ల రైతులకు సంకెళ్లు వేసిన అమానవీయ ఘటనపై.. అసెంబ్లీలో చర్చ పెట్టమంటే పెట్టకుండా పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

రైతుల‌కు క్ష‌మాప‌ణ చెప్పేంత దాకా బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో పోరాడుతూనే ఉంటామ‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌న్నారు. రేవంత్ పాల‌న‌లో రెండు ర‌కాల ప‌ర్యాట‌కం కొన‌సాగుతోంద‌ని అన్నారు.

ఒకటి ఢిల్లీ పర్యాటకం ఎక్కే విమానం, దిగే విమానం.. 100 సార్లు ఢిల్లీకి పోయి 100 పైసలు కూడా తెలంగాణకు తేలేని దద్దమ్మలు కాంగ్రెస్ సన్నాసులు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.
రెండోది జైళ్ల పర్యాటకం ఎవ్వరైనా రేవంత్ చేతగాని పాలనపై మాట్లాడితే జైల్లో పెట్టుడు త‌ప్ప ఇంకేమీ చేయ‌డం లేద‌న్నారు.

అస‌లు ల‌గ‌చ‌ర్ల రైతులు చేసిన త‌ప్పేమిటో చెప్పాల‌ని నిల‌దీశారు కేటీఆర్.

RELATED ARTICLES

Most Popular

Recent Comments