NEWSTELANGANA

ఆన‌వాళ్లు మాయం కేటీఆర్ ఆగ్ర‌హం

Share it with your family & friends

సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్ర‌హం
హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఎక్స్ వేదిక‌గా స్పందించిన కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆన‌వాళ్లు లేకుండా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకం మ‌నోభావాలు దెబ్బ తినేలా నిర్ణ‌యం తీసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు కేటీఆర్.

రేవంత్ రెడ్డి తెలంగాణ ఆన‌వాళ్లు లేకుండా చేయాల‌ని చూస్తున్నాడ‌ని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంద‌ని ధ్వజ‌మెత్తారు. తెలంగాణ త‌ల్లి కిరీటం, క‌డియాలు లేకుండా చేశార‌ని వాపోయారు. బ‌తుక‌మ్మ‌, చార్మినార్, కాక‌తీయ క‌ళాతోర‌ణం మాయం చేశారంటూ మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారని, బండ‌కేసి కొట్ట‌డం ఖాయ‌మ‌ని అన్నారు కేటీఆర్.

తెలంగాణ రైతుల భూములు మాయం చేసేందుకు ప్లాన్ చేశాడ‌ని, మూసీ నది ఒడ్డున పేదల ఇండ్లు లేకుండా చేయాల‌ని చూస్తున్నాడ‌ని ఆరోపించారు. టీఎస్ లో ఎస్ మాయం చేశాడ‌ని, ఖజానాలో ఏకంగా కాసులు లేకుండా చేశాడ‌ని ఫైర్ అయ్యారు.