గాడ్సే వారసుడు సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడతామంటే ఎవరైనా ఒప్పుకుంటారా అని అన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు కేటీఆర్ సమక్షంలో. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు.
గాడ్సే వారసుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. బాపు ఘాట్ లో గాంధీ విగ్రహం పెడతామని రేవంత్ రెడ్డి అంటే, గాంధీ మనవడు తుషార్ గాంధీ స్పందించారని… విగ్రహాలు వద్దు, ఆ డబ్బులు పేదవాళ్లకు పంచి పెట్టాలని అన్నారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరాక రేవంత్ రెడ్డి అరాచక పాలన ఎక్కువై పోయిందని ఆరోపించారు. ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్ల కంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువై పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
నాటు నాటు పాట లాగ.. రేవంత్ రెడ్డి నాటు కొట్టుడు కొడుతున్నాడంటూ మండిపడ్డారు. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీని కూడా ఏకి పారేశారు మాజీ మంత్రి. కాంగ్రెస్ పార్టీ , సర్కార్ చేస్తున్న దోపిడీని ఎందుకు బీజేపీ ప్రశ్నించడం లేదని నిలదీశారు కేటీఆర్.
రేవంత్ రెడ్డి బావ మరిది కంపెనీకి అర్హత లేక పోయినా 1100 కోట్ల కాంట్రాక్టు ఎలా వచ్చిందంటే.. సమాధానం చెప్పడం లేదన్నారు.