అరెస్ట్ లకు భయపడను – కేటీఆర్
కాంగ్రెస్..బీజేపీ కక్ష సాధింపులు
హైదరాబాద్ – ఫార్ములా ఇ రేస్ కు సంబంధించి కోట్ల రూపాయలు నిబంధలనకు విరుద్దంగా బదిలీ చేశారన్న ఆరోపణలపై ఏసీబీ దూకుడు పెంచింది. ఇదే సమయంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు, ఆయనను విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి అభ్యర్థించింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది.
దీనిపై తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కోలేకనే సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు కొందరు కక్ష కట్టారని ఆరోపించారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలు తనను లక్ష్యంగా చేసుకున్నాయని ఆవేదన చెందారు. . అవసరమైతే తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
తాను ప్రజల్లోకి వెళతానని, పాదయాత్ర చేపడతానని ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని ప్రకటించారు కేటీఆర్. ఇదిలా ఉండగా రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో తెలంగాణలో ఫార్ములా ఇ కేసు చర్చనీయాంశంగా మారింది.