NEWSTELANGANA

సీఎంకు అంత సీన్ లేదు – కేటీఆర్

Share it with your family & friends

తెలంగాణ అంటేనే కేసీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను అనేంత సీన్ లేదంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.

నువ్వు రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పులు పట్టుకుని పనికి మాలిన కుర్రాడిగా ఉన్నపుడు తెలంగాణా ప్రజల కోసం తన పదవికి రాజీనామా చేసిన విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

మీరు పార్టీ టిక్కెట్ల కోసం లాబీయింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు త‌ను అన్నింటినీ వ‌దులుకుని తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పోరాడాడ‌ని అన్నారు కేటీఆర్.

భిన్నాభిప్రాయాలను అణచి వేయడానికి మీరంతా తుపాకులు ప‌ట్టుకుని ఊరేగుతుంటే త‌ను ఒకే ఒక్క‌డు ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టేందుకు వెనుకాడ లేద‌న్నారు. తెలంగాణ సాధించేంత వ‌ర‌కు ఈ గ‌డ్డ మీద కాలు పెట్ట‌న‌ని ప్ర‌క‌టించిన అరుదైన నాయ‌కుడు అని స్ప‌ష్టం చేశారు.

చిల్ల‌ర రాజ‌కీయాలు చేసే వాళ్ల‌కు ఆయ‌న అర్థం కాడ‌న్నారు. తెలంగాణను అస్థిర పరిచేందుకు మీ చేతులు “బ్యాగ్స్” పట్టుకున్నప్పుడు, అతని హృదయం చరిత్ర సృష్టించే రాష్ట్రం కోసం ప్ర‌య‌త్నం చేశాడ‌ని అన్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అని మ‌రోసారి స్ప‌ష్టం చేస్తున్నాన‌ని పేర్కొన్నారు కేటీఆర్.

సూర్య చంద్రులు ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటాడ‌ని, ఆయ‌న పేరును ఎవ‌రూ చెరిపి వేయ‌లేర‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు . నువ్వు చీఫ్ మినిష్ట‌ర్ కావ‌ని చీప్ మినిష్ట‌ర్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.