ఢిల్లీ మే కుస్తీ గల్లీ మే దోస్తీ – కేటీఆర్
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ పై ఫైర్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రధానంగా కేబినెట్ లో కీలకమైన శాఖలకు మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఇళ్లు, ఆఫీసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ పెద్ద ఎత్తున సోదాలు చేపట్టిందని కానీ దానికి సంబంధించి ఒక్క విషయం కూడా బయటకు రాలేదని అన్నారు కేటీఆర్.
దీనిపై కేబినెట్ కు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు మినిష్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం చెప్పాలని, ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే విచిత్రంగా సీఎం మాత్రం ప్రధానమంత్రి మోడీతో, భారతీయ జనతా పార్టీతో దోస్తానా చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు కేటీఆర్.
కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత ధనవంతుడైన మంత్రిగా పేరు పొందారంటూ పొంగులేటిపై ఫైర్ అయ్యారు. ఈడీ దాడుల తర్వాత గౌతమ్ అదానీ హైదరాబాద్ లో రహస్యంగా మంత్రితో భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. వాషింగ్ మెషీన్ ఆన్ చేశారు. అంతా ఖామూష్. ఎక్కడి వారంతా అక్కడే గప్ చుప్ గా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.