NEWSTELANGANA

రేవంత్ రెడ్డి..కిష‌న్ రెడ్డి ఇద్ద‌రూ ఒక్క‌టే – కేటీఆర్

Share it with your family & friends

దేవుళ్ల పేరుతో ఒక‌రు హైడ్రా పేరుతో మ‌రొక‌రు

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో భ‌యాందోళ‌ను సృష్టిస్తున్నాడ‌ని, ఇదే స‌మ‌యంలో ఒక బాధ్య‌త క‌లిగిన కేంద్ర మంత్రి ప‌ద‌విలో ఉన్న కిష‌న్ రెడ్డి ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని నిల‌దీశారు కేటీఆర్.

రేవంత్ రెడ్డి, కిష‌న్ రెడ్డి ఇద్ద‌రూ ఒక్క‌టేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్. ఇళ్లు కూల్చుతామ‌ని సోనియా గాంధీ చెప్పారా అని సీఎంను నిల‌దీశారు. బాధితుల‌కు సంబంధించిన ఇళ్ల‌ను డ్యామేజ్ చేస్తుంటే ఎందుకు రాలేద‌ని కేంద్ర మంత్రిని ప్ర‌శ్నించారు కేటీఆర్.

రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలసి పేద ప్రజలను ఆగం చేద్దామని మాట్లాడుకున్నారా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో ఆదుకోవాల్సిన వాళ్లు, భ‌రోసా ఇవ్వాళ్సిన వాళ్లు మౌనంగా ఉంటే ఎలా అని అన్నారు.

దేవుళ్ల పేరుతో చెప్పుకొని ఓట్లు వేయించుకొని ప్రజలకు కష్టం వస్తే పారిపోయేటోడు నాయకుడు ఎట్ల అవుతాడో కిషన్ రెడ్డి చెప్పాలని నిల‌దీశారు కేటీఆర్. గ‌రీబోళ్ల జోలికి వ‌స్తే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. వారికి తాము అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

న‌మామీ గంగా కోసం 2,400 కిలోమీట‌ర్ల‌కు రూ. 20 వేల కోట్లు మోడీ ఖ‌ర్చు చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం 55 కిలోమీట‌ర్ల మూసీ కోసం ల‌క్షా 50 వేలు ఖ‌ర్చు చేస్తాన‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.