NEWSTELANGANA

హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ త‌గ‌దు – కేటీఆర్

Share it with your family & friends

బుచ్చ‌మ్మ‌ది ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యే

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో పాల‌న అట‌కెక్కింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కేవ‌లం హైడ్రా పేరుతో రాజ‌కీయం చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. ఎవ‌రు ఏం చేస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. సోమ‌వారం హైడ్రా కూల్చివేతల భయం కారణంగా కూకట్‌పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అర్థం, పర్థం లేకుండా ఆనాలోచితంగా గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు కూకట్‌పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారంటూ ఆరోపించారు. హైడ్రా అనే బ్లాక్‌మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పి.. నోటీసులు ఇవ్వకుండానే మీ ఇళ్లు కూలగొడుతామంటూ భయానక వాతావారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని వాపోయారు.

పిల్లలు పుస్తకాలను తీసుకుంటామంటే కూడా తీసుకోనీయ‌కుండాపేదల ఇళ్లు కూలగొట్ట‌డం భావ్యం కాద‌న్నారు. ఇలాంటి చ‌ర్య‌లు త‌గ‌ద‌న్నారు. ఎక్క‌డ త‌న ఇల్లు కూల్చుతారేమోన‌నే భ‌యంతో బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ఆరోపించారు కేటీఆర్. హైడ్రా అనే సంస్థ కారణంగానే బుచ్చమ్మ బలవన్మరణం చెందార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇది ఆత్మహత్య కాదు. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య అని మండిప‌డ్డారు.