సీఎంకు అంత సీన్ లేదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
రంగారెడ్డి జిల్లా – సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పదే పదే తమను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ కు రాబోయే రోజుల్లో జనం గుణపాఠం చెప్పక తప్పదన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో తెలంగాణ సమాజం చూస్తోందన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఓటు శాతం తేడాతో తాము పవర్ లోకి రాలేక పోయామని పేర్కొన్నారు. అయినా పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. తాము మీ వెంట ఉన్నామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్.
మనందరి ముందున్న లక్ష్యం సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమని దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు.