సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇంకో పార్టీలోకి ఫిరాయింపులు ప్రోత్సహిస్తే రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.
కేటీఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా తమ పార్టీకి చెందిన వారిని బలవంతంగా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తను అన్న మాట ప్రకారం ఇప్పుడు తమ వారిని చేర్చుకునేలా ప్రోత్సహించిన రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టి చంపాలో తనే చెప్పాలని ఎద్దేవా చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఇక్కడి నుంచి వచ్చిన వారు అక్కడ ఎంత కాలం ఉంటారో వారికే తెలియదన్నారు.
అయినా ఎవరు పార్టీని వీడినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిదని చెప్పారు కేటీఆర్. తమకు ఎలాంటి ఫరక్ పడదన్నారు.