Saturday, April 5, 2025
HomeNEWSకేసీఆర్ కు స‌రితూగే నేత‌లు లేరు

కేసీఆర్ కు స‌రితూగే నేత‌లు లేరు

మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌ర‌వుతార‌ని చెప్పారు. కేసీఆర్ స్థాయి వేర‌ని, ఆయ‌న స్థాయికి కాంగ్రెస్ నేత‌లు స‌రి పోర‌న్నారు. వీళ్లు మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది ఆయన మౌనంగా ఉన్నార‌ని అన్నారు.
మోడీ మంచోడు అనకపోతే జైల్లో వేస్తాడని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి ఆ పని చేయలేడు కదా.. ఆయన నిస్సహాయుడంటూ పేర్కొన్నారు. వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ కోసం త‌మ హ‌యాంలోనే కృషి చేశామ‌న్నారు కేటీఆర్. కానీ ఇప్పుడు తామే చేసిన‌ట్లు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి వెనక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని అన్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకు వచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. టీడీఆర్ ఎక్కడెక్కడ ఉన్నయో ఆయన చుట్టూ ఉన్న నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని ధ్వ‌జమెత్తారు. వందల వేల కోట్ల కుంభకోణానికి నలుగురు బ్రోకర్లతో సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని ఆరోపించారు. శ్రవణ్ ను 2023 లో నామినేట్ చేశామ‌న్నారు. అప్పుడు కావాల‌ని బీజేపీ ఆపింద‌న్నారు. అందుకే కేసిఆర్ మళ్ళీ గుర్తించి అవకాశం ఇచ్చారని చెప‌పారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీ లో నడవటం లేదన్నారు… కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్న విష‌యాన్ని గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments